ఆఫ్ స్క్రీన్ లుక్ తో స్టన్ చేస్తున్న ప్రభాస్.!

ఆఫ్ స్క్రీన్ లుక్ తో స్టన్ చేస్తున్న ప్రభాస్.!

Published on Oct 1, 2020 1:17 PM IST

మన టాలీవుడ్ లో ఉన్న హోలీవుడ్ రేంజ్ కటౌట్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కూడా ఒకటి. బాహుబలి సినిమా తర్వాత నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మన హీరో అదే స్టార్డం ను అలా మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. సినిమా సినిమాకు మంచి లుక్స్ తో కనిపిస్తూ స్టన్ చేస్తున్నాడు.

అయితే అది ఆన్ స్క్రీన్ లో అయితే ఆఫ్ స్క్రీన్ లో అదిరిపోయే లుక్స్ తూ రెబల్ స్టన్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా తాను నటిస్తున్న “రాధే శ్యామ్” షూట్ కోసం ప్రిపేర్ అవుతుండగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ ఇపుడు బయటకొచ్చాయి. సోషల్ మీడియాలో ఇలా వచ్చిన ఫోటోలు అలా ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయాయి.

మాస్క్ తో షార్ట్ హోల్డ్ చేస్తూ ఉన్న లుక్ ను చూసి అయితే రెబల్స్ మరింత స్థాయిలో మురిసిపోతున్నారు. మొత్తానికి మాత్రం ప్రభాస్ అవుట్ స్టాండింగ్ లుక్స్ సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్”లో పూజా హెగ్డే నటిస్తుండగా రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు