ప్రపంచం బయపడుతున్నా, ప్రభాస్ ఆగడం లేదు.

Published on Mar 15, 2020 12:44 pm IST

దశాబ్దాల తరువాత ప్రపంచం చవిచూస్తున్న అతిపెద్ద ప్రమాదం కరోనా వైరస్. ఈ నూతన వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ ప్రపంచం మొత్తాని భయపెడుతున్న నేపథ్యంలో ప్రజలు స్థంభించి పోతున్నారు. ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా చిత్ర పరిశ్రమ కుదేలవుతుంది. కొత్త సినిమాల విడుదల మరియు షూటింగ్ షెడ్యూల్స్ ఆగిపోయాయి. ఐతే ప్రభాస్ మాత్రం తగ్గేది లేదంటున్నాడు.

ఆయన నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ షెడ్యూల్ జార్జియాలో జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ చిత్ర షూటింగ్ నిర్వహిస్తున్నారట. దర్శకుడు రాధా కృష్ణ పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ మరియు గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More