పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంకా రిద్ధి కుమార్ అలానే మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ది రాజా సాబ్”. కొన్నాళ్ల పాటుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ ఇపుడు స్పిరిట్ లోకి వెళ్ళబోతున్నారు.
మేకర్స్ అన్ని పనులు శరవేగంగా కంప్లీట్ చేసి ఆన్ సినిమా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రమోషన్స్ ని కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా కేవలం ఆన్లైన్ వరకే ఉండిపోకుండా ఆఫ్ లైన్ లో కూడా ప్లాన్డ్ గా వెళ్లిపోతున్నారని చెప్పాలి. సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా మొన్న ఫస్ట్ సింగిల్ లాంచ్ వరకు ఆఫ్ లైన్ లోనే సందడి చేస్తూ రాజా సాబ్ ని జనంలో ఉండేలా చూస్తున్నారు.
ఇది మంచి మూవ్ అని చెప్పాలి. ఇక లేటెస్ట్ గా రెండో సాంగ్ కి కూడా లులు మాల్ వేదికగా ప్లాన్ చేశారు. మరి మున్ముందు ఎలాంటి ప్లానింగ్ అండ్ ప్రమోషన్స్ తో వీరు వస్తారో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా జనవరి 9న రాబోతుంది.


