సునీల్ ఇంట్లో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్

సునీల్ ఇంట్లో షూటింగ్ జరుపుకోనున్న ప్రభాస్

Published on Jan 7, 2012 6:30 PM IST


త్వరలోనే ప్రభాస్ హాస్య కథానాయకుడు సునీల్ ఇంట్లో షూటింగ్ జరుపుకోనున్నారు. ఆశ్చర్యపోకండి సునీల్ “మర్యాద రామన్న” చిత్రం కోసం వాడిన ఇంట్లోనే ప్రభాస్ చిత్రం “వారధి” ఈ నెల 16 నుండి చిత్రీకరణ జరుపుకోనుంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ్ ఈ చిత్రం లో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో బలమయిన కథ ఉండటంతో పాటు ప్రభాస్ కొత్త రకమయిన పాత్రలో కనిపించబోతున్నారు. కొరటాల శివ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు