ఫ్రెండ్స్‌తో ప్రభాస్ హాలీడే టైమ్..!

ఫ్రెండ్స్‌తో ప్రభాస్ హాలీడే టైమ్..!

Published on Jul 21, 2015 1:07 PM IST

prabhas1
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతగానో ఇష్టపడి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ భారీ అంచనాల మధ్యన ఈ మధ్యే అన్ని చోట్లా సంచలన విజయాలను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే! రెండో వారం కూడా ఈ సినిమా రికార్డుల వేటను కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది. ఇక తమ మూడేళ్ళ కష్టం చివరకు ప్రేక్షకుల మన్ననలు పొందడంతో బాహుబలి టీమ్ సంబరాల్లో మునిగిపోయింది.

ఇక ‘బాహుబలి’ కోసం, రాజమౌళి విజన్ కోసం మూడేళ్ళు ఇతర సినిమాలేవీ ఒప్పుకోకుండా, వ్యాపకాలూ ఏవీ పెట్టుకోకుండా సినిమాయే జీవితంగా మూడేళ్ళు గడిపిన మరో వ్యక్తి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలిలో ఆయన యాక్టింగ్‌కు, బాహుబలి కోసం తనను తాను మార్చుకున్న విధానానికి ప్రభాస్‌కు అన్ని చోట్ల నుంచీ ప్రశంసలు ముంచెత్తాయి. ఇక బాహుబలి విడుదలై పోవడం, మంచి విజయం సొంతం చేసుకోవడంతో ఒక బాధ్యత తీరిన సందర్భంగా ప్రభాస్ వెకేషన్ ప్లాన్ చేశారు.

తన మిత్రులతో కలిసి ఒక రెండు వారాల పాటు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో హాలీడేను ఎంజాయ్ చేయనున్నారు ప్రభాస్. మూడేళ్ళుగా ‘బాహుబలి’ సినిమాయే ఏకైక లక్ష్యంగా ఏర్పరుచుకొని కష్టపడ్డ ప్రభాస్ కొన్నాళ్ళు విశ్రాంతికి బయలుదేరారు. ఇక ఈ వెకేషన్ పూర్తయ్యాక మళ్ళీ బాహుబలి పార్ట్ 2 కోసం సిద్ధం కానున్నారు. ఇక దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీతో కొద్దిరోజుల క్రితమే వెకేషన్‌కు బయలుదేరిన విషయం తెలిసిందే!

తాజా వార్తలు