ప్రభాస్ సాహో మూవీ ఎక్కడ చూస్తాడో తెలుసా?

Published on Aug 29, 2019 3:34 pm IST

సాహో విడుదలకు ఇంకా కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలివుంది. ఇప్పటికే ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు టికెట్స్ బుక్ చేసుకొని షో కొరకు వేచి చూస్తున్నారు.మరి ఫ్యాన్స్ అంతలాఆరాధించే ప్రభాస్ సాహో మూవీ ఎక్కడ చూడనున్నదో తెలుసా?. ప్రభాస్ సాహో స్పెషల్ షో దుబాయిలో చూస్తారట. అక్కడ ఆయన సాహో స్పెషల్ స్క్రీనింగ్ ఎంజాయ్ చేసిన తరువాత వెంటనే హాలిడే కి వెళ్ళిపోతారట.

ప్రభాస్ సాహో ప్రమోషన్స్ కొరకు నెలరోజులకు పైగా విపరీతంగా కష్టపడ్డాడు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఇండియాలోని అనేక ప్రదేశాలు తిరగడంతో పాటు, అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొన్నారు. అందుకే ఎవ్వరికి తెలియని ప్రదేశానికి హాలిడే ట్రిప్ కొరకు ప్రభాస్ వెళ్లిపోనున్నారట.

సంబంధిత సమాచారం :