యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మంచు ఫ్యామిలీతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ రోజు ఉదయం మంచు విష్ణు తన ఇంటిలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేసి సన్నిహితులను మిత్రులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా ఈ వేడుకలకు హాజరయిన ప్రభాస్ మంచు ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు దంపతులతో మరియు మోహన్ బాబుతో సరదాగా ప్రభాస్ ఫొటోలు దిగారు.
ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలకు మరికొందరు ప్రముఖులు కూడా హాజరయ్యారట. మోహన్ బాబుతో ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ‘దేనికైనా రెడీ’ సినిమాకి ప్రభాస్ డబ్బింగ్ కూడా చెప్పారు. మొత్తానికి ప్రభాస్ కి మంచు ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది.
ప్రభాస్ ప్రస్తుతం `జిల్` చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తోన్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను నవంబర్ లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో పెద్ద సెట్ వేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.



