ప్రభాస్ “కల్కి 2898AD” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!?

ప్రభాస్ “కల్కి 2898AD” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!?

Published on May 30, 2024 8:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898AD (kalki 2898AD). ఈ చిత్రం ను మే జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అయితే ఈ చిత్రం కి సంబందించిన ట్రైలర్ ను జూన్ 7, 2024 న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

దీపికా పదుకునే, దిశా పటాని లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు