ప్రభాస్ “కల్కి 2898 AD” ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ గట్టిగానే!

ప్రభాస్ “కల్కి 2898 AD” ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ గట్టిగానే!

Published on Feb 16, 2024 9:02 PM IST

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ దర్శకత్వం లో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి 2898 AD తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. మే 9, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కానుంది. శరవేగంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్న ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ 75 కోట్లకు కోట్ అయ్యాయి. ఇది సెన్సేషన్ అని చెప్పాలి.

దీపికా పదుకునే కథానాయికగా నటిస్తున్న తమ సూపర్‌హీరో చిత్రం కోసం మేకర్స్ ఆశిస్తున్నది ఇదే. తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ని స‌మాచారం. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల్లో ఇదే అత్యధికం. సలార్ పెద్ద హిట్ కావడంతో, ప్రభాస్ మళ్లీ గేమ్‌లోకి వచ్చాడు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు