ప్రభాస్ “ది రాజా సాబ్” నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే!

ప్రభాస్ “ది రాజా సాబ్” నెక్స్ట్ షెడ్యూల్ అప్పుడే!

Published on Feb 28, 2024 4:11 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం కల్కి 2898AD చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. లండన్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం తో సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ కల్కి 2898AD తో పాటుగా, ది రాజా సాబ్ చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన నెక్స్ట్ షెడ్యూల్ మార్చ్ మొదటి వారం లో స్టార్ట్ కానుంది. లండన్ లో ప్రస్తుతం జరుగుతున్న కల్కి 2898 AD షెడ్యూల్ తర్వాత ఇది స్టార్ట్ కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు