కోకాపేట లో ప్రభాస్ వారధి

కోకాపేట లో ప్రభాస్ వారధి

Published on Dec 17, 2011 10:41 AM IST

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా ‘వారధి’ అనే చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగం గా కోకాపేట లో జరుగుతోంది. ఈ చిత్రానికి అనుష్క మరియు రిచా గంగోపాధ్యాయ హీరోఇన్లు. ఈ చిత్రం ఒక పూర్తి కమర్షియల్ సినిమా గా రూపుదిద్దుకుంటుంది అని తెలుస్తోంది.

ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు. కొరటాల శివ ఈ చిత్రం తో దర్శకుడి గా మారబోతున్నారు. గతం లో అయన పలు హిట్ చిత్రాలకు డైలాగ్ లు రాశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు