హాలీవుడ్ లా పై ఫైర్ అయిన ప్రభుదేవా

prabhu-deva1
ఇండియన్ ఫేమస్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా డైరెక్టర్ గా మారిన తర్వాత బాగా యాంగ్రీ మాన్ గా అయ్యాడని చెప్పాలి. ప్రభుదేవా ఇంత కోపం తెచ్చుకోవడానికి గల కారణం అతని సినిమా టైటిల్స్ ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడమే. ప్రస్తుతం అజయ్ దేవగన్ హీరోగా ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘యాక్షన్ జాక్సన్’.

ఈ టైటిల్ కూడా ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది. ఈ టైటిల్ పై హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కాపీరైట్ కేసు వేసారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. ఈ విషయంపై ప్రభుదేవా మీడియాతో మాట్లాడుతూ ‘ ఇండియాలో మనం పెట్టుకునే ప్రతి టైటిల్ కి ఎందుకు అబ్రాడ్ వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలనేది నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ లా అలా ఉంటే జేమ్స్ కామెరూన్ తీసిన అవతార్ సినిమా పేరుతో బాలీవుడ్ లో డైరెక్టర్ మోహన్ కుమార్ సినిమా తీసాడు. మరి దీనికి వారేమి చెబుతారని’ ప్రశ్నించాడు.

ప్రభుదేవా తీసిన వాంటెడ్, రాంబో రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, రౌడీ రాథోర్ లాంటి టైటిల్స్ ఇంగ్లీష్ నుంచి తీసుకున్నవే. ఈ విషయంతో బాగా విసుగెత్తిపోయిన ప్రభుదేవా ఇక నుంచి తన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టకూడదని డిసైడ్ అయ్యాడు.

Exit mobile version