మెగాస్టార్ డాన్స్ పై ప్రభుదేవా లేటెస్ట్ పోస్ట్ వైరల్.!

మెగాస్టార్ డాన్స్ పై ప్రభుదేవా లేటెస్ట్ పోస్ట్ వైరల్.!

Published on Feb 16, 2024 1:00 PM IST

తెలుగు సినిమా గతినే తన డాన్స్ తో మార్చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఇప్పుడు వరకు కూడా తన ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ తో ఎంతోమందికి ప్రేరణగా కొనసాగుతున్నారు. మరి మెగాస్టార్ ని చూసి ఇన్స్పైర్ అయ్యిన వారిలో ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా ఒకరు. మరి ప్రభుదేవా మెగాస్టార్ చిరంజీవి డాన్స్ పై పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఒకటి ఫ్యాన్స్ లో ఎగ్జైటింగ్ గా మారింది.

మెగా మెగా మెగాస్టార్ డాన్స్ అండ్ వర్కవుట్ చేయడం అనేది ఒక డెడ్లీ కాంబినేషన్ అన్నట్టుగా చిరు తనకి ఇన్స్పిరేషన్ అని ఓ వీడియో షేర్ చేసి ప్రభుదేవా తెలియజేసాడు. దీనితో ఈ పోస్ట్ మంచి వైరల్ గా మారింది. మరి మెగాస్టార్ ప్రభుదేవా కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి మళ్ళీ వీరి కాంబినేషన్ లో మ్యాజికల్ అండ్ ట్రెండ్ సెట్టింగ్ మూమెంట్స్ ఏమన్నా పడతాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు