25 ఏళ్ల తర్వాత ఆ పాటను చేయనున్న ప్రభుదేవా !

Published on May 31, 2019 7:00 pm IST

ప్రభుదేవా రెండు, మూడు భాషల్లో నటుడిగా, దర్శకుడిగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ అనే బిరుదు పొందిన ఈయన ఇప్పటికీ అద్భుతమైన నృత్యాలను కంపోజ్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా ప్రభుదేవా కెరీర్లో ఎప్పటికీ గుర్తిండిపోయే పాట 1994లో వచ్చిన ‘ప్రేమికుడు’ సినిమాలోని ముక్కాలా ముక్కాబులా. ఈ పాట వచ్చి 25 ఏళ్ళు గడిచినా అందులో ప్రభుదేవా వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తాయి.

అలాంటి పాటను, ఆ స్టెప్పుల్ని ఇప్పుడు రిపీట్ చేయనున్నారు. ప్రభుదేవా నటిస్తున్న సినిమాల్లో రెమో డిసౌజా డైరెక్షన్లో రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’ కూడా ఒకటి. నృత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభుదేవా ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇందులో ముక్కాలా ముక్కాబులా పాటను కొత్తగా చేయనున్నారు ఆయన. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా ఈ చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More