యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ నిరాశ పరిచినప్పటికీ, ఆయన క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగానే కాకుండా నిర్మాతగా మారి తన మొదటి సినిమాను కూడా మొదలుపెట్టేశాడు.
లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తున్న ఈ సినిమాలో ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు మెయిన్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాడట. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.
ఈ ప్రాజెక్ట్ కథను ప్రదీప్ రంగనాథన్ స్వయంగా చూసుకుని ఓకే చేశాడట. ఒక పక్కా బడ్జెట్‌లో, ప్రొడక్షన్ పనులన్నీ తనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడని తెలుస్తోంది. నిర్మాతగా ప్రదీప్ చేస్తున్న ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.


