క్రిష్ సినిమాలో ప్రగ్యా జైస్వాల్.. నిజమేనా ?

Published on Sep 27, 2020 7:30 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలతో పాటు అటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను కూడా ఒప్పుకున్నారు. ఇప్పటికే వేణు శ్రీరామ్ మరియు క్రిష్ లతో చేస్తోన్న సినిమాల షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ను త్వరలో మొదలుపెట్టి పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినా.. నవంబర్ నుండి తిరిగి పవన్ షూట్ లో పాల్గొంటారట. అయితే క్రిష్ – పవన్ సినిమాలో ఓ కీలక రోల్ కటి ఉందట. సినిమాలో పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. కాగా ఆ ప్రేమించే హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోవాలనే ఆలోచనలో క్రిష్ ఉన్నారని తెలుస్తోంది.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. కాగా పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో నడిచే చిత్రమని, ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘పింక్’ రీమేక్ మే నెలలో విడుదలకానుండగా ఆ వెంటనే పెద్దగా గ్యాప్ లేకుండా ఈ చిత్రం కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More