వరుణ్ తేజ్ సరసన ప్రజ్ఞ జైస్వాల్..!

Pragya-Jaiswal1
జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటించబోయే సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాలో నటిస్తుంది.

‘టిట్టో ఎంబిఏ’, ‘విరాట్టు’, ఇండో – కెనడియన్ ఫిల్మ్ ‘ఎ లిటిల్ హెవెన్ ఇన్ మీ’లో నటించింది. ఆయా సినిమాలలో ఆమె నటన చూసి దర్శకనిర్మాతలు ఇంప్రెస్ అయ్యారు. వెంటనే ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు అని యూనిట్ వర్గాలు తెలిపాయి.

ఈ సినిమా ముహూర్త కార్యక్రమం ఫిబ్రవరి 27న జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

Exit mobile version