‘రంగస్థలం’ ఫై ప్రశంసలు కొనసాగుతూనేవున్నాయి !

‘రంగస్థలం’ ఫై ప్రశంసలు కొనసాగుతూనేవున్నాయి !

Published on May 15, 2018 11:00 PM IST

‘రంగస్థలం’ సినిమా ఫై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఈ సినిమా వచ్చి దాదాపుగా నెలన్నర కావచ్చిన సినిమా కి హౌస్ ఫుల్ బోర్డు లు ఇంకా పడ్తూనే ఉన్నాయి .ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరోచ్చింధి . ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో చేసిన నటనకు అందరు ముగ్థులైపోయారు. ఈ సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు చూపిన ప్రతిభ, అలాగే కెమెరా మెన్ రత్నవేలు ఛాయా గ్రహణం, ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ వేసిన సహజమైన సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమా విజయానికి దోహదపడ్డాయి .

కలెక్షన్స్ పరంగా కూడా రంగస్థలం చాలా రికార్డులను బద్దలు కొట్టింది . ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమా ‘బాహుబలి’ తరువాత రెండవ స్థానంలో కొనసాగుతుంది. తాజాగా రంగస్థలం సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసారు. ప్రైమ్ లో సినిమా చూసిన ప్రేక్షకులు తమకు నచ్చినా సన్నివేశాలపై తమ అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్నిమైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

తాజా వార్తలు