విలన్ ను సత్కరించిన మరో స్టార్ విలన్ !

Published on Sep 28, 2020 5:43 pm IST

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటుల్లో బ్రహ్మాజీ ముందు వరుసలో ఉంటారు. సామాజిక అంశాలతో పాటు తన సన్నిహితుల పై కూడా ఆయన ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. ఇక కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి తెలిసిందే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే సోనూ సూద్‌.. రియ‌ల్ లైఫ్లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకుంటూ ముందుకుపోతున్నాడు. అందుకే నటుడు ప్రకాష్ రాజ్, సోనూ సూద్‌ ను సన్మానించారు.

ఈ విషయం గురించి బ్రహ్మాజీ ట్వీట్ చేస్తూ ‘మా ప్రకాష్ రాజ్ గారి నుండి వచ్చిన మంచి ప్రశంస. సోను సూద్ ఎంతోమందికి సహాయం చేసినందుకు అల్లుడు అదుర్స్ సెట్స్‌ పై అతన్ని సత్కరించారు’ అంటూ బ్రహ్మాజీ పోస్ట్ చేశారు. ఇక లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు ఆయన. అలాగే ఎవ‌రు స‌హాయం అడిగినా లేద‌నుకుండా అర్హులైన ప్ర‌తీ ఒక్క‌రికీ సాయం చేస్తూ మాన‌వ‌త్వాన్ని చాటుకున్నాడు.

సంబంధిత సమాచారం :

More