‘దృశ్యం 3’లోకి ప్రకాష్ రాజ్.. నేనెవరినీ రీప్లేస్ చెయ్యడం లేదు!

Drishyam 3

ఇండియన్ సినిమా దగ్గర వచ్చినటువంటి కొన్ని ఫైనెస్ట్ సీక్వెల్ చిత్రాల్లో ‘దృశ్యం'((Drishyam) సిరీస్ కూడా ఒకటి. పార్ట్ 1 కి కొనసాగింపుగా వచ్చిన పార్ట్ 2 చిత్రాలకి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దృశ్యం సినిమా హిందీలో ఈ చిత్రాన్ని దర్శకుడు అభిషేక్ పాఠక్, ఒరిజినల్ కథ, మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కథ తోనే తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ నటిస్తుండగా ఆ మధ్య వెర్సటైల్ నటుడు అక్షయే ఖన్నా ఈ సినిమా నుంచి వైదొలిగినట్టు పలు రూమర్స్ వచ్చాయి. ఇక తన పాత్రని మరో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రీప్లేస్ చేసినట్టు కూడా వినిపించింది. కానీ లేటెస్ట్ గా దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించడం జరిగింది. తాను హిందీ దృశ్యం 3(Drishyam 3) లో జాయిన్ అయినట్టు తాను ఖరారు చేశారు.

ప్రతీ ఒక్కరూ తన రోల్ ని ఇష్టపడతారు అని చెబుతూనే నేనెవరినీ రీప్లేస్ చేయడం లేదు అంటూ అసలు క్లారిటీ ఇచ్చారు. సో ప్రకాష్ రాజ్ పాత్ర పూర్తిగా కొత్తగా ఉంటుంది అని చెప్పాలి. అలాగే అక్షయే ఖన్నా కూడా కొనసాగుతున్నట్టే అని బాలీవుడ్ ఆడియెన్స్ భావిస్తున్నారు. మరి తన ప్రెజెన్స్ పై క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version