
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నాగార్జునని ‘మనం’ లాంటి ఒక ప్రయోగాత్మకమైన చిత్రం తీయాలని నిర్ణయం తీసుకున్నందుకు అభినందించారు. ఇటీవల జరిగిన ఒక పాత్రికేయుల సమావేశంలో ప్రకాష్ రాజ్ ఈ విధంగా స్పందించారు.
“‘మనం’ చిత్రం లో ఒక అసాధారణమైన కథ వుంది. ‘మనం’ విజయం ఎంత అసాధారణమైన కథనైన తీసేవిధంగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నదానికి ఉదాహరణ. ఇటువంటి బోల్డ్ స్టెప్ తీసుకున్నందుకు నాగార్జునకు హాట్స్ ఆఫ్” అని ప్రకాష్ రాజ్ అన్నారు.
ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యాని’ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రాన్ని ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు.