పవన్ పై సంచలనం రేపుతున్న ప్రకాష్ రాజ్ కామెంట్స్.!

Published on Nov 28, 2020 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వీరిద్దరి కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే వీరిద్దరూ కూడా అనేక సినిమాల్లో కలిసి నటించారు కూడా. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు కూడా సినిమాలు ప్లస్ రాజకీయాల్లో కూడా బిజీ గానే ఉన్నారు. పవన్ కు అయితే సొంతంగా పార్టీ ఉంది ప్రకాష్ రాజ్ ఇండిపెండెంట్ గానే రాజకీయ అంశాలను చర్చిస్తారు.

అయితే ఎప్పటి నుంచో కూడా ప్రకాష్ రాజ్ సెంట్రల్ ప్రభుత్వం పై తన విమర్శలను కురిపిస్తున్నారు. అలా అదే కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉన్న పవన్ జనసేన పార్టీపై చేసిన పలు సంచలనం కామెంట్స్ ఇప్పుడు సినీ మరియు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

ఇటీవలే ఇచ్చిన ఏ ఇంటర్వ్యూ లో పవన్ బీజేపీకు సప్పోర్ట్ చెయ్యడంతో అసలు ఆయనకేమయిందో అర్ధం కావడం లేదని ఆ మధ్య వారే గొప్ప అన్నట్టు సపోర్ట్ చేసారు ఆ తర్వాత బాలేదని వారి మీదనే విమర్శలు చేసి విడిపోయారు. ఇప్పుడు మళ్ళీ కలిశారు ఇదంతా చూస్తూనే పవన్ ఒక ఊసరవెల్లి మాదిరి అనిపిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసారు.

పవన్ వైఖరితో నిజంగా చాలా డిజప్పాయింట్ అయ్యానని అతను ఒక పార్టీకి లీడర్ అయ్యుండి వేరే వారిపై వేలు చూపించడం ఏంటో అర్ధం కాలేదని వారి ఓట్ షేరింగ్ ఏంటి వీరి ఓట్ షేరింగ్ ఏంటి బీజేపీ భుజానెక్కి తాను కూడా బీజేపీ మనిషి అయ్యిపోయాడని జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ది చెప్తారని ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More