“వకీల్ సాబ్” పై పూరీకి థాంక్స్ చెప్తున్న ప్రకాష్ రాజ్.!

Published on Apr 9, 2021 3:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” ఈరోజు విడుదలై యూనానిమస్ టాక్ ను తెచ్చుకొని పవన్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచేలా కనిపిస్తుంది. అయితే ఈ చిత్రం పింక్ కు రీమేక్ గా మన స్టైల్ లో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించారు. మరి ఈ సినిమాలో పవన్ చేసిన లాయర్ రోల్ కు అపోజిట్ గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటించిన సంగతి తెలిసిందే. మరి ప్రకాష్ రాజ్ రోల్ కోసం ట్రైలర్ వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.

పైగా దానికి నందా అనే పేరుతో ఉండడం మరో ఆసక్తికర అంశం. దీనితో మళ్ళీ బద్రి, నందాల కాంబో రిపీట్ అవుతుంది అని పవన్ అభిమానులు అభిప్రాయ పడ్డారు. దీనితో ఇప్పుడు ఆ ట్రెండ్ సెట్టింగ్ కాంబోను పరిచయం చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్ కు ప్రకాష్ రాజ్ ఇప్పుడు థాంక్స్ చెబుతున్నారు. “బద్రి” తో నందా కాంబో క్రియేట్ చేసిన పూరికి థాంక్స్ చెబుతూ మళ్ళీ ఆ కాంబో రిపీట్ అయ్యి వకీల్ సాబ్ తో మ్యాజిక్ చేసింది అని అందుకు పూరీకి ప్రకాష్ రాజ్ థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :