‘చీకటి రాజ్యం’లో తన పార్ట్ పూర్తిచేసిన ప్రకాష్ రాజ్!

‘చీకటి రాజ్యం’లో తన పార్ట్ పూర్తిచేసిన ప్రకాష్ రాజ్!

Published on Jul 22, 2015 11:02 AM IST

Prakash-Raj
నటుడిగా దేశావ్యాప్తంగా తనదైన మార్క్, బ్రాండ్‌ను చాటి చెప్పిన నటుల్లో కమల్ హాసన్‌ ఒకరు. ఎప్పుడూ ఏదో ప్రయోగంతో మనముందుకు వచ్చే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేసి చాలా కాలమే అయింది. గతంలో ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కమల్ చేసిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా ‘ఈనాడు’.

తాజాగా ఆయన చాన్నాళ్ళకు ‘చీకటి రాజ్యం’ మరో స్ట్రైట్ తెలుగు సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. గతంలో కమల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాజేష్ ఎమ్ సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గత కొద్ది రోజుల నుంచి చెన్నై, హైద్రాబాద్‌లలో జరుగుతోంది.

ఇక ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్న విషయం తెలిసిందే! తాజా సమాచారం మేరకు ప్రకాష్ తన పార్ట్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గిబ్రాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

తాజా వార్తలు