సుజిత్ నన్ను సరికొత్తగా చూపించాడు – అడవి శేష్

సుజిత్ నన్ను సరికొత్తగా చూపించాడు – అడవి శేష్

Published on Jun 18, 2014 3:26 PM IST

aadavi-sheshu
స్వతహాగా మంచి జాబు చేస్తూ అమెరికాలో సెటిల్ అయిన అడవి శేష్ సినిమాల మీద ఉన్న మక్కువతో ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ ఆరడుగుల హీరో. సినిమా బ్యాక్ గ్రౌండ్ లేని ఒకతనికి ఇండస్ట్రీలో మరియు సినిమా రిలీజ్ లకి ముంది ప్రెజర్ హై లెవల్లో ఉంటుందనే విషయాన్ని శేష్ కూడా ఒప్పుకున్నాడు. అడవి శేష్ ‘రన్ రాజా రన్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.

ఈ సినిమాకి పని చేసిన డైరెక్టర్, నిర్మాతలు, టెక్నికల్ టీం గురించ చెబుతూ ‘వంశీ, ప్రమోద్ చాలా స్వీట్ పర్సన్స్. చాలా బాగా చూసుకుంటారు. ఈ సినిమాని ధూల్ పేట్ లాంటి రియల్ లోకేషన్స్ లో షూట్ చేసాం. కానీ అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరూ అందరినీ బాగా చూసుకున్నారు. మీరు శర్వా, అనుష్క, ప్రభాస్ లను అడిగినా కూడా ఇదే చెప్తారు. రన్ రాజా రన్ ఒక యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్. పంజా తర్వాత చెప్పుకునే సినిమా ఇది. నాలోని సరికొత్త యాంగిల్ ని చూపించిన సినిమా. ఈ సినిమాలో లుక్, మానరిజమ్స్ కోసం డైరెక్టర్ సుజిత్ తో కలిసి గంటలు గంటలు మాట్లాడుకున్నాం. అలాంటి డైరెక్టర్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తను మూవీని చాలా బాగా డీల్ చేసాడని’ అన్నాడు.

తాజా వార్తలు