అతిగా ప్రేమించ‌డం కూడా హానిక‌ర‌మే అంటున్న ‘ప్ర‌ణ‌వం’- హీరో శ్రీ మంగం

అతిగా ప్రేమించ‌డం కూడా హానిక‌ర‌మే అంటున్న ‘ప్ర‌ణ‌వం’- హీరో శ్రీ మంగం

Published on Feb 4, 2021 6:43 PM IST

మొదటి సినిమాతోనే బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న హీరో శ్రీ మంగం కొంత గ్యాప్ త‌ర్వాత ‘ప్ర‌ణ‌వం’ సినిమా లాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్, టైటిల్‌తో మన ముందుకు వ‌స్తున్నాడు. చరిత‌ అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా కుమార్. జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ సినిమాకు త‌ను.ఎస్ నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఈ నెల 5వ తేదిన విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీ మంగం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత ‘ప్ర‌ణవం’ వంటి డిఫరెంట్ క‌థ‌ను ఎన్నుకోవ‌డానికి కారణం?

నా తొలి సినిమాల్లో కాలేజ్ గోయింగ్, బాయ్ నెక్ట్స్ డోర్ పాత్ర‌లు చేశాను. కానీ ఈ సినిమా అలా కాదు. చాలా మెచ్యూర్డ్ లుక్‌తో మ్యారిడ్ కపుల్‌గా న‌టిస్తున్నానని, నాలో కానీ, బాడీ లాంగ్వేజ్ లో కానీ అప్ప‌టికీ ఇప్ప‌టికీ చాలా డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయని, అంతేకాదు నా క్యార‌క్ట‌ర్ తో పాటు ఈ సినిమా కంటెంట్ కూడా న‌చ్చ‌డంతోనే చేశానని, ఖ‌చ్చితంగా నాకు ఈ సినిమా ప్ల‌స్ అవుతుంద‌ని నమ్ముతున్నా.

ప్ర‌ణ‌వం స్టోరీ ఎలా ఉండబోతుంది?

భ‌గ‌వంతుడు మ‌న‌కు ఎన్నో వ‌రాలు ఇచ్చాడు. ఆడ‌వాళ్లు కూడా అందులో ఒక‌టి. అటువంటి ఆడ‌వారికి హాని త‌ల‌పెట్ట‌కుండా చూసుకున్నంత కాలం మ‌న జీవితాలు బాగుంటాయి. ఎప్పుడైతే వారికి హాని త‌ల‌పెట్టాల‌ని భావిస్తామో మ‌నంద‌రి జీవితాలు చిన్నాభిన్న‌మ‌వుతాయని ఆ అంశాన్నే మా ఈ చిత్రంలో చూపించామని, అంతేకాదు ఆడ‌వారిని ప్ర‌కృతితో పోలుస్తాం కాబట్టి ఎప్పుడైతే ప్ర‌కృతికి మ‌నం హాని త‌ల‌పెడ‌తామో అప్పుడు ప్ర‌కృతి వైప‌రిత్యాలు సంభ‌విస్తుంటాయని ఒక్క మాటలో చెప్పారు.

ప్ర‌ణవంలో మీ పాత్ర స్వ‌భావం ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో నేను ప్లే బాయ్ పాత్ర‌లో న‌టించానని, ఒక అమ్మాయి న‌న్ను అతిగా ప్రేమించ‌డం వ‌ల‌న నేను ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను అనేది నా పాత్ర‌ అని కొన్ని కొన్ని సార్లు సిట్యుయేష‌న్స్ ని బ‌ట్టి నా పాత్ర నెగిటివ్ గా కూడా అనిపిస్తుందని అది ఎలా ఉండబోతున్నది అనేది మాత్రం మీరు తెర‌పై సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌ల ప‌నితీరు ఎలా ఉంది?

దర్శకుడు కుమార్. జి చెప్పిన స్క్రీన్ ప్లే నాకు బాగా న‌చ్చిందని, ఇది చాలా డెలికేట్ పాయింట్ అని దానిని డీల్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదుని అన్నారు. ఈ విష‌యంలో మా డైర‌క్ట‌ర్ స‌క్సెస్ అయ్యారని, త‌నకు ఇది తొలి సినిమా అయినా ఎక్క‌డా ఆ ఫీలింగ్ అనిపించలేదని చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమా తీశారని, అంతేకాదు ప్ర‌తి విష‌యంలో ఆయనా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారని, మా నిర్మాత త‌ను.ఎస్ గారూ కూడా నిర్మాత‌లా కాకుండా ఒక వ‌ర్కర్ లా ఈ సినిమా కోసం శ్ర‌మించారని, సినిమా అంటే మా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు విప‌రీత‌మైన ప్యాష‌న్ అని వీరిద్ద‌రికీ మా ప్ర‌ణవం సినిమా స‌క్సెస్ సాధించి పెట్టి మ‌రెన్నో సినిమాలు నిర్మించే అవ‌కాశం ఇవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా.

ప్ర‌ణ‌వంపై ఎలాంటి హోప్ తో ఉన్నారు?

ఈ సినిమాతో ఖచ్చితంగా నాకు మరో ప‌ది సినిమాలు వ‌స్తాయన్న న‌మ్మ‌కం ఉందని, హీరోగా కాక‌పోయినా విల‌న్‌గా అయినా అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం నాకు ఉందని, ప్ర‌ణవంలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశానని, కథ‌కి ఇంపార్టెన్స్ ఉన్న ఏ క్యార‌క్ట‌ర్ అయినా నేను చేయ‌డానికి సిద్ధంగా ఉన్నా.

ఈ సినిమాలో మీ స‌హ న‌టుల గురించి చెప్పండి?

ఈ సినిమాలో శశాంక్, జెమిని సురేష్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో క‌నిపిస్తారని, అలాగే నా వైఫ్ గా న‌టించిన అవంతిక‌, మ‌రో హీరోయిన్‌గా న‌టించిన గాయ‌త్రి కూడా మంచి ప‌ర్ఫార్మెన్స్ కనబరిచారు.

సాంకేతిక నిపుణుల గురించి చెప్పండి?

మా సినిమాకు పద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతంతో పాటు మ‌ర్గ‌ల్ సినిమాటోగ్ర‌ఫీ హైలెట్ గా నిలుస్తాయని, ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చిందని, పిక్చ‌రైజ్ ప‌రంగా కూడా పాట‌లు బాగా వచ్చాయని, ముఖ్యంగా ఆర్‌పి ప‌ట్నాయ‌క్ గారు, ఉష గారు పాడిన పాట సినిమాకు మెయిన్ ఎస్సెట్.

‘ప్ర‌ణ‌వం’ ద్వారా మీరు ఏమైనా సందేశాన్ని ఇస్తున్నారా, దీనికి ఇనిస్పిరేష‌న్ ఏమైనా ఉందా?

నేను చేసే కాన్సెప్ట్ ఏదైనా స‌రే, స‌మాజానికి కానీ, ప్ర‌తి మ‌నిషి రిలేటెడ్ చేసుకునే విధంగానే ఉంటాయి. అయితే ప్ర‌ణ‌వం సినిమాలో కొన్ని సీన్స్ ఆల్ రెడీ పెళ్లైన జంట‌ల‌కు డైర‌క్ట్ గా త‌గిలే విధంగా ఉంటాయని, ప్ర‌తి ఒక్క‌రూ రిలేట్ చేసుకునేలా మా సినిమాలోని పాత్ర‌లుంటాయని, అయితే మా ఈ కథ ఏ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ కాదని మ‌న చుట్టూ ఉన్న స‌మాజంలో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే నిజ సంఘ‌ట‌న‌ల‌ను బేస్ చేసుకుని రాసుకున్న క‌థ అని, చివరగా అతి ప్రేమ కూడా హానిక‌ర‌మే అనే సందేశాన్ని అంత‌ర్లీనంగా చెబుతున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు