ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో “ప్రసన్న వదనం”

ఓటిటిలో రికార్డు రెస్పాన్స్ తో “ప్రసన్న వదనం”

Published on May 27, 2024 10:01 PM IST

రీసెంట్ గా మన తెలుగు సినిమా నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ హిట్ చిత్రాల్లో టాలెంటెడ్ నటుడు సుహాస్ హీరోగా రాశి సింగ్ హీరోయిన్ గా దర్శకుడు అర్జున్ వై కే తెరకెక్కించగా మంచి హిట్ అయ్యింది. ఒక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం సుహాస్ కెరీర్ లో మరో క్రేజీ హిట్ గా నిలవగా ఈ చిత్రం రీసెంట్ గానే మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.

మరి ఈ చిత్రం ఓటిటిలో కూడా అదరగొడుతుండడం విశేషం. లేటెస్ట్ గా ఈ చిత్రం ఆహా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కి పైగా క్రాస్ చేసేసింది. అది కూడా ఫాస్టెస్ట్ స్ట్రీమింగ్ మినిట్స్ ని ఈ చిత్రం క్రాస్ చేయడం విశేషం. ఇక దీనితో ఓటిటిలో కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా టి ఆర్ ప్రసాద్ రెడ్డి, మణికంఠ జె ఎస్ లు లిటిల్ థాట్స్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు