సుహస్ “ప్రసన్నవదనం” టిక్కెట్ల ధరల వివరాలు ఇవే!

సుహస్ “ప్రసన్నవదనం” టిక్కెట్ల ధరల వివరాలు ఇవే!

Published on May 2, 2024 6:01 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే మేకర్స్ టిక్కెట్ల ధరల విషయం లో మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ లలో 145 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో 177 రూపాయలు కాగా, తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ లలో 110 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లలో 150 రూపాయలు. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్ మరియు మల్టీ ప్లెక్స్ లలో 150 రూపాయలు గా నిర్ణయించారు. ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పాలి. మంచి కంటెంట్ తో హైప్ ను క్రియేట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు