డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ప్రసన్నవదనం”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ప్రసన్నవదనం”

Published on May 17, 2024 10:31 PM IST

టాలెంటెడ్ హీరో సుహాస్ వరుస చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. చివరిసారిగా ప్రసన్నవదనం చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం మే 3, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయినట్లు తెలుస్తొంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని సొంతం చేసుకుంది.

తాజాగా ఆహా వీడియో ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ డేట్ పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. మే 24, 2024 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించడం జరిగింది. ప్రసన్నవదనం చిత్రంలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌ పై మణికంఠ జెఎస్ మరియు ప్రసాద్ రెడ్డి టిఆర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు