తన సినిమాటిక్ యూనివర్స్ పై ప్రశాంత్ వర్మ క్రేజీ ప్లానింగ్

తన సినిమాటిక్ యూనివర్స్ పై ప్రశాంత్ వర్మ క్రేజీ ప్లానింగ్

Published on Apr 24, 2024 1:01 PM IST

సినీ ప్రేమికులకు ఓ సరైన సినిమా పడితే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. మరి అలా సినిమాతో దర్శకులు రచయితలూ క్రేజీ ఆలోచనలతో మారుతున్న కాలంలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ని చూసే వీక్షకులకు అందిస్తున్నారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి లింక్ పెడుతూ స్టార్ట్ చేసిన ఆ ట్రెండ్ నే సినిమాటిక్ యూనివర్స్.

హాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యిన ఈ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర కూడా ఊపందుకుంటుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమాటిక్ యూనివర్స్ ని మన తెలుగులో యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందుకు తీసుకెళ్తున్నాడు. తన “హను మాన్” (Hanu Man), “అధీరా” (Adhira) ఇంకా మరిన్ని సినిమాలు తన “ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్” (PVCU) వస్తాయని ఎప్పుడో తెలియజేసాడు.

మరి ఈ యూనివర్స్ పై లేటెస్ట్ గా మరో సాలిడ్ స్టేట్మెంట్ ని ఇచ్చాడు. కేవలం ఈ యూనివర్స్ లో సినిమాల కోసం ఏకంగా 20 ఏళ్ళు స్పెండ్ చేయబోతున్నట్టుగా రివీల్ చేసాడు. అంటే రానున్న 20 ఏళ్ల వరకు కూడా ఏ సినిమాలు రావాలి అనేది ఒక ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పాలి. మరి చూడాలి తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మూవీ లవర్స్ ఏ తరహా సినిమాలు వస్తాయో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు