“హను మాన్” : మెగాస్టార్ కామెంట్స్ పై ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్

“హను మాన్” : మెగాస్టార్ కామెంట్స్ పై ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్

Published on Apr 13, 2024 12:00 PM IST

ఈ ఏడాదిలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా “హను మాన్” (Hanu Man Movie) టాపిక్ ఇప్పటికీ కొనసాగుతుంది అని చెప్పాలి. సినిమా 100 రోజులు రన్ దగ్గరకి వస్తున్నప్పటికీ హీరో తేజ సజ్జ (Teja Sajja) దర్శకుడు ప్రశాంత్ వర్మల పేర్లు పాన్ ఇండియా లెవెల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా తెలుగు సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Comments on Hanu Man) చేసిన పలు కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.

తాను కూడా హనుమాన్ లాంటి సినిమా చేద్దాం అనుకున్నాను అని కానీ దానిని తేజ సజ్జ చేసాడు నాకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వీడియోలో తేజ సజ్జ ఎమోషనల్ రియాక్షన్ అవన్నీ వైరల్ అవుతుండగా దీనిపై ప్రశాంత్ వర్మ లేటెస్ట్ పోస్ట్ పెట్టాడు. పద్మవిభూషణ్ చిరంజీవి గారి లాంటి వారి డ్రీం ప్రాజెక్ట్ హను మాన్ అనే మాటకంటె గొప్పది ఏముంది అని ఈ మాటలు నాలో మరింత బరువు భాద్యతలను పెంచాయి అని.

ఖచ్చితంగా ఈ మాటలని తాను తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అని ఈ వీడియో చూస్తున్నంతసేపు నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను అక్కడ తేజ ఎలాంటి అనుభూతిని అనుభవిస్తున్నాడు నాకు మాత్రమే అర్ధం అవుతుంది అని ప్రశాంత్ వర్మ ఎమోషనల్ పోస్ట్ చేసాడు. దీనితో మెగాస్టార్ అభిమానులు తేజ, ప్రశాంత్ వర్మ ఫాలోవర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ “జై హనుమాన్” (Jai Hanuman) కోసం ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు