“జై హనుమాన్” : అంజనాద్రి 2.0 ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ

“జై హనుమాన్” : అంజనాద్రి 2.0 ని పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ

Published on Mar 31, 2024 9:00 AM IST

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ చిత్రం “హను మాన్” (Hanu Man). మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్ళని అందుకొని అదరగొట్టింది. మరి ఈ చిత్రంపై సీక్వెల్ గా “జై హనుమాన్” (jai Hanuman) ని తాను అనౌన్స్ చేయగా దీని కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ చిత్రం పై ఆల్రెడీ కసరత్తులు చేస్తున్న ప్రశాంత్ వర్మ. లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ మరింత ఆసక్తి రేకెత్తించింది. ఆల్రెడీ హను మాన్ లో ఒక కల్పిత గ్రామం ‘అంజనాద్రి’ ని డిజైన్ చేసి చూపించాడు. అయితే ఈసారి జై హనుమాన్ లో అంజనాద్రి 2.0 ని పరిచయం చేసాడు. చిన్న వీడియో పెట్టి అంజనాద్రి లో సముద్రం అందులోని కొండలతో కూడిన దృశ్యాలు చూపించాడు. దీనితో జై హనుమాన్ లో విజువల్స్ మరింత కొత్తగా మరింత గ్రాండ్ గా ఉండబోతున్నాయని తాను ప్రామిస్ చేస్తున్నాడు. ఇక ముందు తన నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు