“జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్

“జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్

Published on Apr 17, 2024 11:27 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “హను మాన్” (Hanu Man Movie) కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన తెలుగు సినిమా నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా ఇది రాగా దీనికి తెలుగు ఆడియెన్స్ సహా పాన్ ఇండియా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు.

దీనితో ఈ సినిమాకి సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం “జై హనుమాన్” (Jai Hanuman Update) కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అనుకున్నట్టుగానే ప్రశాంత్ వర్మ నుంచి ఈ శ్రీరామ నవమి కానుకగా ఒక ఆసక్తికర పోస్టర్ తో అదిరే అప్డేట్ ని అందించాడు.

మరి నీలి మేఘ శ్యామునికి ప్రమాణం చేస్తున్నట్టుగా హనుమంతుని చేతులని చూపిస్తూ వచ్చిన ఈ పోస్టర్ తో ప్రశాంత్ వర్మ కూడా ఒక గూస్ బంపింగ్ ప్రామిస్ ని అందరికీ చేసాడు. ఈ పవిత్రమైన రోజు రామ నవమి సందర్భంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం.. జై హనుమాన్ తో ప్రపంచ ప్రేక్షకులకి ఒక మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని లైఫ్ టైం లో సెలెబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని తాను ప్రామిస్ చేసాడు. దీనితో ఈ రామ నవమి కానుకగా వచ్చిన ఈ సాలిడ్ అప్డేట్ జై హనుమాన్ కోసం ఎదురు చూస్తున్న వారిలో మరింత సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు