“జై హనుమాన్” ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్డ్!?

“జై హనుమాన్” ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్డ్!?

Published on Apr 2, 2024 8:59 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అవైటెడ్ గా ఎదురు చూస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రాల్లో “జై హనుమాన్” (Jai Hanuman Movie) కూడా ఒకటి. యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం “హను మాన్” (Hanu Man) కి సీక్వెల్ గా వస్తున్నా ఈ చిత్రం కోసం కూడా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.

అయితే రీసెంట్ గా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ లు ఇచ్చిన హింట్స్ తో అయితే హను మాన్ సీక్వెల్ నుంచి అప్డేట్ ఈ ఏప్రిల్ లోనే రాబోతున్నట్టుగా అర్ధం అవుతుంది. మరి ఈ ఉగాది కానుకగానే అవైటెడ్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ రావచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుండగా ఇపుడు దీనికి డేట్ ఫిక్స్ అయ్యినట్టుగా టాక్.

మరి దీని ప్రకారం జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఈ ఏప్రిల్ 9న రావచ్చని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి గౌర హరీష్ సంగీతం అందిస్తుండగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహిస్తున్నారు అలాగే వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు