తన ఫేవరేట్ డైరెక్టర్ పై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

తన ఫేవరేట్ డైరెక్టర్ పై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Feb 27, 2024 5:46 PM IST

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో సలార్ చిత్రం తీసి మరో హిట్ సాధించారు. ఈ డైరెక్టర్ ఇటీవల తన ఫేవరేట్ డైరెక్టర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన ఫేవరేట్ డైరెక్టర్, స్టార్ హీరో ఉపేంద్ర అంటూ చెప్పుకొచ్చారు. A, ఓం, ష్, ఉపేంద్ర వంటి చిత్రాల స్టోరీ టెల్లింగ్ కి ప్రపంచం లోనే ఎవరూ సాటిలేరు అంటూ చెప్పుకొచ్చారు. ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ UI కి సంబందించిన సాంగ్ మార్చ్ 4 న రిలీజ్ కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు