“సలార్”, “కేజీయఫ్ 2″లతో నీల్ బిజీ బిజీ.!

Published on Mar 15, 2021 10:02 am IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ బ్లాక్ బస్టర్ చిత్రం “కేజీయఫ్”. ఇలాంటి సాలిడ్ ఎంటర్టైనర్ ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక్క దెబ్బతో కన్నడ సినిమా మార్కెట్ ను పెంచేసాడు. అలాగే పాన్ ఇండియన్ లెవెల్లో కూడా తన సినిమాలకు యష్ కు మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టేసాడు. మరి అందుకే ఇప్పుడు చేస్తున్న “కేజీయఫ్ చాప్టర్ 2″పై ఎన్నో అంచనాలు సెట్టయ్యాయి.

ఇక దీనితో తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో అనౌన్స్ చేసిన “సలార్” పై మరో లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు నీల్ మాత్రం ఈ రెండు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడట. ఇప్పుడు ఒక పక్క సలార్ సెకండ్ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉండడమే కాకుండా కేజీయఫ్ చాప్టర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కూడా బాగా బిజీగా ఉన్నాడట. మొత్తానికి మాత్రం ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ ను నమోదు చేసేవే కావడంతో ఒకదాన్ని మించే అంచనాలనే నీల్ సెట్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :