ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ స్థాయిని పెంచే చిత్రం..!

Published on May 29, 2020 1:11 pm IST

ఎన్టీఆర్ 31వ చిత్రం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే ఉంటుంది అనే వార్త చాలా కాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంది. ఐతే దీనిపై ఫ్యాన్స్ లో సందేహాలు ఉండగా, ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ప్రశాంత్ నీల్ వేసిన ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. దీనితో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ లాంఛనమే అని అందరూ భావిస్తున్నారు. కాగా ఈ మూవీపై మరో ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పీరియడ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరక్కించనున్నాడట. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశాడట.

ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా ఇది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఇక ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మరియు త్రివిక్రమ్ మూవీ నుండి బయటకి రావడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుంది. ప్రశాంత్ నీల్ సైతం అక్టోబర్ తరువాత కెజిఎఫ్2 ప్రాజెక్ట్ నుండి బయటికి వస్తాడు. ఈ లోపు పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి 2021లో మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లాలన్నది ప్లాన్ అట.

సంబంధిత సమాచారం :

More