“కేజీయఫ్” జర్నీకి స్టార్ట్ తప్ప ఎండ్ లేదు.!

Published on Mar 13, 2021 5:24 pm IST

ఇండియన్ సినిమాలో ఫ్యాన్స్ అందరికీ కూడా “కేజీయఫ్” అనే సినిమా పరిచయం లేని పేరు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ యాక్షన్ చిత్రం మాస్ ఆడియెన్స్ లో ఒక అతి పెద్ద కల్ట్ క్లాసిక్ అయ్యిపోయింది. అంతే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా భారీ వసూళ్లను రాబట్టి రెండో చాప్టర్ పై నెవర్ బిఫోర్ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇప్పుడు చాప్టర్ 2 కూడా విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.

అయితే లేటెస్ట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ మొత్తం తన “కేజీయఫ్ చాప్టర్ 1” టీం తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి తన ఆనందం వ్యక్తంగా చేసాడు. యష్ మరియు తన నిర్మాతతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసాడు. తమ కేజీయఫ్ జర్నీ కి ఒక గ్రేట్ స్టార్ట్ అయితే ఉంది కానీ ఎలాంటి ఎండ్ లేదని మరోసారి తమ జ్ఞ్యాపకాలను గుర్తు చేసుకున్నాడు. దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి వీరి కాంబో నుంచి వస్తున్న కేజీయఫ్ చాప్టర్ 2 ప్రపంచ వ్యాప్తంగా జూలై 16న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :