“సలార్” కు ఈ విషయంలో నీల్ సాలిడ్ ప్లానింగ్స్.?

Published on Dec 11, 2020 5:32 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేపట్టిన పలు ఆసక్తికర పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో లేటెస్ట్ గా సెన్సేషన్ ను నమోదు చేసిన ప్రాజెక్ట్ “సలార్”. జస్ట్ అనౌన్స్మెంట్స్ తోనే దేశ వ్యాప్తంగా భారీ హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రం కోసం డార్లింగ్ అభిమానులు అప్పుడే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి ప్రభాస్ అనే పేరు ఎలా అయితే కారణం అయ్యిందో అలాగే “కేజీయఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ మూలాన కూడా అంతే హైప్ నమోదు అయ్యింది. దీనితో ఈ సెన్సేషనల్ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అందుకు తగ్గట్టుగానే నీల్ అదిరిపోయే బ్యాక్ డ్రాప్ తో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించనున్నారు.

మరి దీనితో పాటుగా క్యాస్టింగ్ పరంగా కూడా నీల్ దగ్గర సాలిడ్ ప్లానింగ్స్ ఉన్నాయట. ఇప్పటికే పలు ఇండస్ట్రీల నుంచి స్టార్ నటుల లిస్ట్ ను ప్రిపేర్ చేసుకున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశా పటాని ని హీరోయిన్ గా ఎంపిక చేసారని రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సాలిడ్ చిత్రానికి నీల్ ఎలాంటి క్యాస్ట్ ను సెట్ చేశారో చూడాలి.

సంబంధిత సమాచారం :