“సలార్” లో కంప్లైంట్ విషయంపై ప్రభాస్ కి ఓ రేంజ్ ఎలివేషన్

“సలార్” లో కంప్లైంట్ విషయంపై ప్రభాస్ కి ఓ రేంజ్ ఎలివేషన్

Published on Jan 21, 2024 9:00 AM IST

Salaar 16

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన అవైటెడ్ భారీ చిత్రం “సలార్” ప్రభాస్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఈ సినిమా రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చేసింది. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో వచ్చాక కొన్ని డిజప్పాయింటింగ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక మెయిన్ గా వాటిలో అసలు సినిమాలో ప్రభాస్ కి చాలా తక్కువ డైలాగ్స్ ఉన్నాయి అనేది కూడా ఒకటి.

ఇది ఫ్యాన్స్ లో కూడా ఒక కంప్లైంట్ కాగా ఈ ప్రశ్న లేటెస్ట్ గా సోషల్ మీడియాలో దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య వరకు వెళ్లగా ఆమె దానికి ఇచ్చిన సమాధానం ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. మరి ఈ కంప్లైంట్ పై ఆమె స్పందిస్తూ అక్కడ ప్రభాస్ కటౌట్ తాలూకా నీడనే మిలియన్ డైలాగ్స్ కి సమానమైనపుడు తనకి డైలాగ్స్ ఉండాల్సిన పని లేదు అని రిప్లై ఇచ్చారు. దీనితో ఈ ఎలివేషన్ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేసింది. దీనితో ఈ రిప్లై ఇపుడు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

Likita

సంబంధిత సమాచారం

తాజా వార్తలు