“RRR” నిర్మాణ సంస్థతో నీల్..ఇంట్రెస్ట్ గా మారిన ఈ ప్రశ్న.!

“RRR” నిర్మాణ సంస్థతో నీల్..ఇంట్రెస్ట్ గా మారిన ఈ ప్రశ్న.!

Published on Jun 4, 2021 5:41 PM IST

తన “కేజీయఫ్” సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ వాంటెడ్ దర్శకునిగా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ఇక ఆ రెండు చిత్రాలు అనంతరం కూడా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” ను ప్లాన్ చేశారు. ఇక దీనితో మరో సెన్సేషనల్ మాస్ కాంబో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా కన్ఫర్మ్ చెయ్యడంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే తెలుగులో మరో బడా నిర్మాణ సంస్థతో నీల్ చిత్రం ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది.

అదే ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మరో భారీ చిత్రం తీస్తున్న “RRR” నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. ఈరోజు నీల్ బర్త్ డే సందర్భంగా తెలిపిన విషెష్ తో మరోసారి కన్ఫర్మ్ కాగా ఇపుడు అసలు ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అదే ఈ కాంబోలో హీరోగా ఎవరు చేస్తారు అన్నది అందరి హీరోస్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది. అయితే గత కొన్నాళ్ల కితమే నీల్ మరో తెలుగు ప్రాజెక్ట్ కూడా చేస్తారని టాక్ వినిపించింది. మరి అది కాకుండా ఇది ఉంటుందా ఏమిటా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు