హిందీ ఆడియెన్స్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ!

హిందీ ఆడియెన్స్ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంత్ వర్మ!

Published on Feb 12, 2024 4:12 PM IST


చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ సాధించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం నిన్నటితో హిందీ బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువగానే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం 50 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం పట్ల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీజర్ లాంచ్ నుండి, గ్రాండ్ రిలీజ్ వరకూ హిందీ ఆడియెన్స్ నుండి మంచి ఆదరణ లభించింది. హను మాన్ ఘన విజయం సాధించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు