తన బర్త్ డేకి PVSU అఫీషియల్ వెబ్ సైట్ ను లాంఛ్ చేసిన ప్రశాంత్ వర్మ!

తన బర్త్ డేకి PVSU అఫీషియల్ వెబ్ సైట్ ను లాంఛ్ చేసిన ప్రశాంత్ వర్మ!

Published on May 29, 2024 11:00 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ టైమ్ లోనే తన హార్డ్ వర్క్ తో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. డిఫెరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే ప్రశాంత్ వర్మ, ఈ ఏడాది హను మాన్ మూవీ తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను సాధించారు. ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ను అందరికీ పరిచయం చేశారు.

ఈ చిత్రంతో పాటుగా, తను తీయబోయే తదుపరి చిత్రాలు కూడా ఈ యూనివర్స్ లో భాగం అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తన బర్త్ డే సందర్భం గా thepvsu.com ను లాంఛ్ చేశారు. ఈ వెబ్ సైట్ లో తన చిత్రాలకు సంబంధించిన అప్డేట్ లతో పాటుగా, మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. తదుపరి జై హను మాన్ చిత్రం కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు