కరోనాకి వ్యాక్సిన్ తెస్తున్న యంగ్ డైరెక్టర్ మూవీ

Published on May 28, 2020 12:08 pm IST

వైవిధ్య చిత్రాల దర్శకుడిగా పేరున్న ప్రశాంత్ వర్మ ట్రెండీ కాన్సెప్ట్ తో వచ్చారు. ఆయన కరోనా వైరస్ పై ఓ చిత్రం తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి సంబందించిన ప్రీ లుక్ రేపు ఉదయం 9:00 విడుదల కానుంది. ఇక కరోనా వైరస్ లాంటి ప్రాణాంతక వ్యాధికి సంబందించిన వ్యాక్సిన్ పై ఈ మూవీ తెరకెక్కడం గమనార్హం.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన హింట్ ఉంటుందట. ఈ చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది. గతంలో ప్రశాంత్ వర్మ ‘అ’ అనే ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తరువాత హీరో రాజశేఖర్ తో ఆయన చేసిన కల్కి మూవీ గత ఏడాది విడుదలైంది. కరోనా వ్యాక్సిన్ పై ప్రశాంత్ వర్మ తీసే ఆ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కరోనా వైరస్ పై చిత్రం తీయగా దాని ట్రైలర్ కూడా విడుదల కావడం జరిగింది.

సంబంధిత సమాచారం :

More