చైతూ కి ప్రశాంత్ వర్మ థాంక్స్!

చైతూ కి ప్రశాంత్ వర్మ థాంక్స్!

Published on Jan 21, 2024 7:41 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం ను చూసిన పలువురు సినీ ప్రముఖులు సినిమా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాను చూసిన టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించినందుకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి కంగ్రాట్స్ తెలుపుతూ, న్యూ ఏజ్ రైటింగ్, కాన్సెప్ట్ తో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. అంతేకాక నీ యూనివర్స్ లో నన్ను ఇన్వెస్ట్ చేసేలా చేశావు అంటూ చెప్పుకొచ్చారు. తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ల పెర్ఫార్మెన్స్ పై ప్రశంసలు కురిపించారు. నాగ చైతన్య చేసిన పోస్ట్ కి గానూ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రెస్పాండ్ అవుతూ, థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు