ప్రతిరోజూ పండగే 5డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

ప్రతిరోజూ పండగే 5డేస్ కలెక్షన్స్ రిపోర్ట్

Published on Dec 25, 2019 2:45 PM IST

prathiroju pandage

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతిరోజూ పండగే వసూళ్లు దుమ్ముదులుపుతుంది. కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్ర వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా నైజాంలో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది. మూడురోజులకు గాను నైజాంలో 3.80 కోట్లు షేర్ తో వీకెండ్ ముగించిన ఈ చిత్రం పనిదినాలైన సోమ మరియు మంగళవారాలలో కూడా సత్తా చాటింది. సోమవారం 76లక్షల షేర్ రాబట్టిన ప్రతిరోజూ పండగే మంగళవారం 82లక్షలు సాధించడం విశేషం. ఇక నేడు క్రిస్మస్ పండుగ కావడంతో మరికొన్ని మెరుగైన వసూళ్లు రాబట్టుకునే అవకాశం కలదు.

మొత్తంగా ఐదు రోజులకు గాను నైజాంలో ప్రతిరోజూ పండుగే 5.37 కోట్ల షేర్ వసూలు చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు