బుల్లితెరపై దుమ్మురేపిన ప్రతిరోజూ పండగే

Published on Apr 2, 2020 3:43 pm IST

ఈ మధ్య విజయాల పరంగా కొంచెం వెనుకపడ్డ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రంతో భారీ హిట్ అందుకున్నారు. దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ వసూళ్లు అందుకుంది. ప్రతిరోజూ పండగే ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఊహకు మించిన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ స్టార్ మా దక్కించుకుంది.

ఇటీవల స్టార్ మా ఛానల్ లో ఈ చిత్రం ప్రసారంకాగా భారీ టీఆర్పీ దక్కించుకుంది. ఈ మూవీకి ఏకంగా 15.3 టీఆర్పీ రేటింగ్ రావడం విశేషం. ధరమ్ గత చిత్రాలలో బెస్ట్ రేటింగ్ కావడంతో పాటు, ఈ మధ్య కాలంలో మంచి టిఆర్పి సాధించిన చిత్రంగా ప్రతిరోజూ పండగే నిలిచింది. జి ఏ 2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

X
More