ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ప్రతిరోజూ పండగే’ !

ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ప్రతిరోజూ పండగే’ !

Published on Dec 4, 2019 7:30 PM IST

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.. మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రం “ప్రతిరోజూ పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేస్తున్నారు. కాగా తాజగా ఈ చిత్రం ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో మెయిన్ కంటెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టర్స్ ను కూడా క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేశారు. సత్యరాజ్ పాత్ర చుట్టూ అల్లుకున్న డ్రామాను హీరో లీడ్ చేయడం, ఆ క్రమంలో మిగిలిన పాత్రల ఎలాంటి ఇబ్బందులు పడ్డాయి.. చివరికీ ఆ పాత్రలు ఎలా మారాయి అంశాలు సినిమా సాగనుందని ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది.

కాగా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో ధరమ్ తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో వీరిద్దరూ “సుప్రీం” సినిమాలో కలిసి నటించడం జరిగింది. ఇక మిగిలిన కీలక పాత్రల్లో సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు