
‘కింగ్’ అక్కినేని నాగార్జున తొలిసారి నటించిన సోషియో ఫాంటసీ సినిమా ‘డమరుకం’. ఈ సినిమా ఇప్పటికే పలు సార్లు రిలీజ్ డేట్ ఇచ్చి కూడా వాయిదావేసారు. ఈ రోజు విడుదల కావాల్సిన ఈ సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈరోజు కాకినాడలో కళ్యాణ్ జ్యువెలరీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నాగార్జున ఈ విషయం పై స్పందిస్తూ ‘డమరుకం’ సినిమా కోసం మీరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. కానీ దానికింకా శివుడు ఆజ్ఞ రాలేదు. ఆ ఈశ్వరుడు ఇంకా ముహూర్తం పెట్టలేదు పెట్టగానే సినిమా విడుదలవుతుంది. నా అభిమానులందరూ వెళ్లి శివుడికి అభిషేకం చేయండి సినిమా రిలీజ్ అవుతుందని’ అన్నారు. ఈ రోజు రిలీజ అవుతుందని ఆశతో థియేటర్లకు వెళ్ళిన చాలా మంది సినిమా లేదని తెలిసి పూర్తి నిరుత్సాహంతో వెనుతిరిగారు. పలు చోట్ల నిరుత్సాహంతో థియేటర్ల పైకి రాళ్ళు కూడా విసిరారు. నాగ్ చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఈ వారంలో ఖచ్చితంగా విడుదలయ్యేలా అనిపిస్తోంది, మనం కూడా అది నిజమవ్వాలని కోరుకుందాం.
శివుడికి అభిషేకం చేయమని పిలుపునిచ్చిన నాగ్
శివుడికి అభిషేకం చేయమని పిలుపునిచ్చిన నాగ్
Published on Nov 10, 2012 5:04 PM IST
సంబంధిత సమాచారం
- మొదటి షో వివరాలు : ఇరుముడి
- ‘స్పిరిట్’లో కొరియన్ బాలయ్య.. అక్కడ మిస్ లీడ్ చేసారా?
- ఊరమాస్ రిపోర్ట్స్ తో మొదలైన ‘ఇరుముడి’ హవా!
- ఓటీటీలోకి వచ్చేసిన కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘చెన్నై లవ్ స్టోరీ’
- ‘మెగా 158’ రిలీజ్ డేట్ మారిందా?
- చిరంజీవి బర్త్‌డే ట్రీట్ సిద్ధం.. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో ‘#Mega158’ టైటిల్ గ్లింప్స్
- ఇంట్రెస్టింగ్.. రజినీకాంత్ కి తెలుగు హీరోలే విలన్లు!
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రికార్డ్: 20 లక్షలకు పైగా టికెట్లు సేల్.. యూఎస్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్
- మాస్ బుకింగ్స్ తో దూసుకెళ్ళిపోతున్న ‘ఇరుముడి’.. రిలీజ్ కి ముందే 2 లక్షల టికెట్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- యూఎస్ మార్కెట్ లో మాస్ ర్యాంపేజ్ చూపిస్తున్న రవితేజ సినిమా!
- ‘టాక్సిక్’కి మన దగ్గర హైకులు అవసరమా?
- ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. తనని వీడి వెళ్ళిపోయిన బఘీర!
- నైజాంలో తెరుచుకున్న ‘ఇరుముడి’ బుకింగ్స్.. ఫ్యాన్స్ ఇక రచ్చ రచ్చే
- ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!
- ఓటీటీలోకి ఘట్టమనేని జయకృష్ణ డెబ్యూ మూవీ: ‘శ్రీనివాస మంగాపురం’ స్ట్రీమింగ్ వివరాలివే!
- షాకింగ్ బజ్: రజినీకి వ్యతిరేకంగా రామ్ పోతినేని?
- మహేష్ ‘వారణాసి’ ఆల్బమ్ పై బిగ్ క్లారిటీ!

