ప్రభాస్ దసరాకి వస్తాడా..?

Published on Feb 28, 2020 8:10 am IST

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాకి ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే ఆసక్తిక టైటిల్స్ ని పరిశీలితున్నారు. ఇప్పటికే 50శాతం వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయించడం వలన, షూటింగు విషయంలో కొంత జాప్యం జరుగుతుంది.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. భారీ హంగులతో రూపొందుతున్న కారణంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువనే టాక్ వినిపించింది. కానీ ఈ సినిమాను దసరా సీజన్లో విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టు తాజా సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More